close
Choose your channels

చిన్నారి పాట‌కు ప‌వ‌న్ ఫిదా

Friday, January 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి అభిమానులు ఉన్న సంగ‌తి తెలిసిందే. కాని ఇప్పుడు ఓ ఎనిమిది సంవత్సరాల బాలుడికి అభిమాని అయిపోయారు ప‌వ‌న్‌. ఆ బాలుడి పేరే జిబిగ్స్. పోలాండ్‌కి చెందిన ఈ ఎనిమిది సంవత్సరాల భార‌తీయ సంత‌తి 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ స్వ‌యంగా పాడిన 'కొడకా కోటేశ్వర్రావూ ఖరుచైపోతవురో' పాటను.. పవన్‌కి న్యూ ఇయర్ గిఫ్ట్‌గా త‌ను ఇచ్చే బ‌హుమ‌తిగా యూట్యూబ్‌లో పెట్టాడు.

ఈ పాట‌కి స‌ర్వ‌త్రా మంచి స్పంద‌న వ‌చ్చింది. అంతేకాకుండా. ఈ వీడియో ప‌వ‌న్ వ‌ర‌కు చేరుకుంది. క‌ట్ చేస్తే.. ఈ పాటకి ఫిదా అయిపోయిన పవన్.. వెంటనే పికె క్రియేటివ్ వర్క్స్ అకౌంట్ ద్వారా తన మెసేజ్‌ని ట్వీట్ చేసారు. "ప్రియమైన జిబిగ్స్ బుజ్జి, నా ప్రియమైన చిన్న స్నేహితుడా.. నీ న్యూ ఇయర్ బహుమతికి కృతజ్ఞతలు. నీ సందేశం నాకు వచ్చింది. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలి" అని ఆ బాలుడు పాడిన పాట లింక్‌ని కూడా షేర్ చేసారు పవన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.