close
Choose your channels

నాని చేతుల మీదుగా పిట్టగోడ టీజర్..!

Saturday, November 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌న్ సైన్ సినిమాస్ & సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పిట్ట‌గోడ‌. డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో డి.దినేష్ కుమార్, రామ్మోహ‌న్ పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌వ్ & ఫ్రెండిషిప్ క‌థాంశంతో తెలంగాణ‌లోని గోదావ‌రిఖ‌ని నేప‌ధ్యంలో ఈ ఎంట‌ర్ టైనింగ్ స్టోరీని రూపొందించారు. ఈ చిత్రంలో నూత‌న న‌టీన‌టులు విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌, పున‌ర్న‌వి భూపాలం ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఉయ్యాల జంపాలా రాజు, జ‌బ‌ర్ధ‌స్త్ రాము, శివ ఆర్.ఎస్, శ్రీకాంత్ ఆర్.ఎన్ త‌దిత‌రులు మిగిలిన పాత్ర‌లు పోషించారు.
ఈ చిత్రాన్ని అనుదీప్ కెవి తెర‌కెక్కించారు.ప్రాణం క‌మ‌లాక‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన పిట్ట‌గోడ ఫ‌స్ట్ లుక్ కు విశేష స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స‌న్ సైన్ సినిమాస్ & సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తి ఒక్క‌రికి థ్యాంక్స్ తెలియ‌చేసారు. అలాగే ఈరోజు రాత్రి 7 గంట‌ల‌కు నేచుర‌ల్ స్టార్ నాని ట్విట్ట‌ర్ ద్వారా పిట్ట‌గోడ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.