close
Choose your channels

మ‌రో క్రేజీ సినిమాలో పూజా హెగ్డే!

Monday, March 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో క్రేజీ సినిమాలో పూజా హెగ్డే!

పొడుగు కాళ్ల సొగ‌స‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తుంది. ఈ ఏడాది ఈ అమ్ముడు బ‌న్నీతో క‌లిసి న‌టించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల కానుంది. అలాగే అఖిల్ హీరోగా రూపొందుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో న‌టిస్తోంది. ఇది కాకుండా అక్ష‌య్ కుమార్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో అవ‌కాశాన్ని ద‌క్కించుకుందని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ క్రేజీ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేంటంటే డైరెక్ట‌ర్ హ‌రి, సూర్య కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సినిమా సంగ‌తి తెలిసిందే. అరువ పేరుతో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.