close
Choose your channels

నితిన్ తో పూజా హెగ్డే రొమాన్స్.. సూపర్ కాంబో సెట్ అయ్యిందిగా!

Wednesday, July 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్ తో పూజా హెగ్డే రొమాన్స్.. సూపర్ కాంబో సెట్ అయ్యిందిగా!

ప్రేమ కథలతో విసిగిపోయిన నితిన్ సరైన మాస్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి టైంలో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ వినిపించిన కథ నితిన్ ని బాగా ఎగ్జైట్ చేసింది. దీనితో ఈ ప్రాజెక్ట్ కు నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం నితిన్ నటించిన మాస్ట్రో చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఓటిటి ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో మాస్ట్రో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. దీనితో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి మాస్ లో తన క్రేజ్ పెంచుకోవాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. దీనికోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు.

ఇదీ చదవండి: అల్లు అరవింద్ భారీ ప్లాన్.. లైన్ లోకి ఇలయథలపతి?

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నితిన్ సరసన నటించేందుకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పూజా ఇప్పటికే ఈ చిత్రానికి సైన్ కూడా చేసేసిందట. దీనితో నితిన్, వక్కంతం వంశీ చిత్రానికి ఒక్కసారిగా హైప్ పెరిగినట్లు అయింది.

రేసుగుర్రం, కిక్, టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ.. అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ చిత్రాన్ని హిట్ గా మలచడంలో వంశీ విఫలం అయ్యారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా నితిన్ చిత్రం కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు.

క్రేజీ హీరోయిన్లతో నటించడంలో నితిన్ స్టయిలే వేరు. భీష్మ చిత్రంలో రష్మిక, రంగ్ దేలో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేసిన నితిన్ ఇప్పుడు పూజా హెగ్డేని రంగంలోకి దించాడు. త్వరలోనే ఈ చిత్రం లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. నితిన్ సొంత బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.