close
Choose your channels

అల్లు శిరీష్‌ షూటింగ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌

Monday, November 13, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌న గ‌త చిత్రం శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు అల్లు వారి క‌థానాయ‌కుడు అల్లు శిరీష్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం చేస్తున్నాడు.

సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో సీర‌త్ క‌పూర్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం బెంగుళూరులో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు స‌డ‌న్‌గా అక్క‌డికి క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ వ‌చ్చారు. అంతేకాకుండా.. ఆ చిత్ర బృందంకి బెస్ట్ విషెస్ చెప్పాడ‌ట‌.

ఇంత‌కుముందు అల్లు శిరీష్.. పునీత్ రాజ్‌కుమార్ అన్న‌య్య శివ‌రాజ్ కుమార్ కొత్త చిత్రం త‌గ‌రు సినిమా టీజ‌ర్ లాంఛ్‌కి హాజ‌ర‌య్యాడు. ఆ టీజ‌ర్ లాంఛ్ స‌మ‌యంలోనే త‌న సినిమా టైటిల్‌ని అనౌన్స్‌మెంట్ చేశాడు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే సినిమా షూటింగ్ కి శివ‌రాజ్‌కుమార్ తమ్ముడు పునీత్ వ‌చ్చాడు. ఒక్క క్ష‌ణం వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.