close
Choose your channels

ప్ర‌భాస్ 20 విడుద‌లెప్పుడో తెలుసా?

Thursday, February 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌భాస్ 20 విడుద‌లెప్పుడో తెలుసా?

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాపై ప్ర‌భాస్ చాలా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి న‌టిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నామ‌ని రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఓ సంద‌ర్భంలో తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో సినిమా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమా విడుద‌ల కానుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 16న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే బ‌య్య‌ర్స్‌తో చ‌ర్చించి దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.