close
Choose your channels

నెక్ట్స్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే..!

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీని తెలుగు, త‌మిళ్ లో ద్విభాషా చిత్రంగా నిర్మించాలి అనుకున్నారు.
అయితే... బాహుబ‌లితో ప్ర‌భాస్ కి బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్ప‌డింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స్టైలీస్ పోలీస్ గా న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక విల‌న్ పాత్ర‌కు బాలీవుడ్ ఏక్ట‌ర్ నీల్ నితిన్ ముఖేష్‌ని తీసుకోవాలనుకుంటున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. జ‌న‌వరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.