close
Choose your channels

టైమ్ వేస్ట్ చేయ‌కూడ‌ద‌నుకుంటున్న ప్ర‌భాస్ టీమ్‌

Tuesday, March 31, 2020 • తెలుగు Comments

టైమ్ వేస్ట్ చేయ‌కూడ‌ద‌నుకుంటున్న ప్ర‌భాస్ టీమ్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20వ సినిమా బిజీలో ఉన్నారు. రీసెంట్‌గానే అంటే లాక్‌డౌన్ అనౌన్స్‌మెంట్‌కు ముందుగానే చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైద‌రాబాద్ చేరుకుంది. క‌రోనా వైర‌స్‌తో ప్ర‌స్తుతం ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. ఆ త‌ర్వాత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకోనున్నాయి. ప్ర‌స్తుతం ఎలాంటి షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ సైలెంట్‌గా ఉంది. అయితే ఈ గ్యాప్‌ను ప్ర‌భాస్ అండ్ టీమ్ వ‌దులుకోవాల‌నుకోవ‌డం లేద‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుతుంద‌ని టాక్‌.

పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను, టైటిల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి రాధాశ్యామ్‌, ఓ మైడియ‌ర్ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. యువీ క్రియేష‌న్స్‌, గోపీ కృష్ణా మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిత‌మ‌వుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. బాహుబ‌లి, సాహో చిత్రాల త‌ర్వాత ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న చిత్ర‌మిది.

Get Breaking News Alerts From IndiaGlitz