'సాహో' లుక్ విడుదల చేసిన ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ ఎదురు చూసినట్లుగానే ప్రభాస్ తన `సాహో` చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. సోమవారం తన సినిమాకు సంబంధించి ఓ సర్ప్రైజ్ ఇస్తానని ప్రభాస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ప్రభాస్ హాయ్ డార్లింగ్ మీ అందరి కోసం ఇదిగో.. నా తదుపరి చిత్రం `సాహో`కి సంబంధించి మరో లుక్. ఆగస్ట్ 15న మీ అందరినీ థియేటర్స్‌లో కలుస్తా`` అంటూ మెసేజ్‌ను కూడా ప్రభాస్ పోస్ట్ చేశారు. ప్రభాస్ స్టైలిష్ లుక్‌ను ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తుంది.
సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. మూడు వందల కోట్ల రూపాయలతో భారీ రేంజ్లో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. అలాగే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 15న రాబోయే ఈ సినిమాలో బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ నటించింది. ఇంకా మందిరా బేడి, జాకీష్రాఫ్ తదితర బాలీవుడ్ తారాగణంతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. శంకర్ ఎహ్సాన్ లాయ్ సంగీతం అందిస్తుండగా మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.