బన్నితో ప్రియా ప్రకాష్ నటించాల్సిందే కానీ...!
Send us your feedback to audioarticles@vaarta.com
వికింగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్.. 'ఒరు ఆడార్ లవ్' సినిమాతో సందడి చేయనుంది. కేవలం కన్నుగీటటంతో ప్రియా ప్రకాశ్‌కు నేషనల్ రేంజ్ క్రేజ్ రావడమే కాదు.. 'ఒరు ఆడార్ లవ్' సినిమాకు క్రేజ్ వచ్చింది. ఒక మలయాళ సినిమా నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల కావడం ఇదే తొలిసారి.
ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానుంది. కేవలం ఒక పాటతో సెన్సేషనల్ కావడంతో ప్రియా ప్రకాశ్‌కు చాలా అవకాశాలే వచ్చాయట. అయితే ఒరు ఆడార్ లవ్ సినిమా అప్పటికింకా పూర్తి కాకపోవడంతో సినిమాలేవీ చేయలేదట.
అలా చేయకుండా పోయిన సినిమాల్లో బన్ని సినిమా కూడా ఒకటి. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో ముందుగా ప్రియా ప్రకాశ్‌నే అడిగారట. కానీ చేయడానికి కుదరడం లేదంటూ ప్రియా ప్రకాశ్ వివరణ ఇచ్చుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.