close
Choose your channels

'పులి' ట్రైలర్ డేట్

Thursday, August 13, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కత్తి` చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్ గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై శిబు తమీన్స్‌, పి.టి.స్వెకుమార్‌ నిర్మిస్తోన్న చిత్రం పులి`. భారీ బడ్జెట్‌, హై టెక్నికల్‌ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా బ్యానర్ పై శోభారాణి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ముందు విడుదలైన ప్రీ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరో ట్రైలర్ ను ఆగస్ట్ 20న విడుదల చేస్తున్నారట. ఈ ట్రైలర్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.