close
Choose your channels

పూరి ఇజం టీజర్ వచ్చేసింది..!

Monday, September 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వినాయక చ‌విత సంద‌ర్భంగా ఇజం టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో క‌ళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ లో అదిరిపోయాడు. ఇంకా చెప్పాలంటే....ఈ లుక్ క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. అలాగే జ‌గ‌ప‌తి లుక్ కూడా చాలా స్టైలీష్ గా ఉంది. పూరి సినిమాల్లో ఉండే గ‌న్స్ & ఛేజింగ్స్ ఇందులోనూ ఉన్నా...కొత్త‌గా ఈ సినిమాలో ఏదో ఉంది అనిపిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈనెల‌లోనే ఆడియోను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.