close
Choose your channels

జనవరి 23న లారెన్స్ 'శివలింగ' టీజర్ విడుదల

Saturday, January 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొరియోగ్రాప‌ర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం `శివ‌లింగ‌`.రితిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ సూప‌ర్‌హిట్ మూవీ శివ‌లింగ రీమేక్‌గా ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. ఈ నెల‌లోనే ఈ సినిమా ఆడియో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు. అయితే త‌మిళ‌నాడులో జల్లిక‌ట్టుపై జ‌రుగుతున్న పోరాటం కార‌ణంగా ఆడియో విడుద‌లను వాయిదా వేశారు. అయితే అంత కంటే ముందు . జ‌న‌వ‌రి 23న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.

కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ '. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది.చిత్రీకరణ పూర్తయింది.నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 23న విడుద‌ల చేస్తున్నాం. అలాగే సినిమాను ఫిబ్రవరి లో సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని నిర్మాత‌లు అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.