close
Choose your channels

రాజ్ తరుణ్ - మారుతి మూవీ టైటిల్ ఇదే..

Tuesday, June 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్‌...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి...తాజాగా ఈడోర‌కం ఆడోర‌కం చిత్రంతో స‌క్సెస్ సాధించిన యువ హీరో రాజ్ త‌రుణ్. తాజాగా రాజ్ త‌రుణ్ హీరోగా అనిల్ సుంక‌ర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మారుతి స్ర్కిప్ట్ అందించ‌డం విశేషం. ఈ మూవీని నూత‌న ద‌ర్శ‌కురాలు సంజ‌న తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మయ్యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత అనిల్ సుంక‌ర్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ఈ మూవీకి రాజు గాడు అనేది టైటిల్ కాగా...య‌మ డేంజ‌ర్ అనేది ట్యాగ్ లైన్. ఈ మ‌ధ్య కాలంలో విన్న బెస్ట్ స్ర్కిప్ట్ ఇది అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసారు. మారుతి - అనిల్ సుంక‌ర్ క‌లిసి చేస్తున్న ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ మ‌రో్ స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.