close
Choose your channels

విజయవాడలో నారా, నందమూరి అభిమానుల సమక్షంలో 'రాజా చెయ్యివెస్తే' పోస్టర్ విడుదల

Tuesday, March 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నారా రోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రాజా చెయ్యి వేస్తే`.ఈగ`, అందాల రాక్షసి`, `లెజండ్`, ఊహలు గుసగుసలాడే`, దిక్కులు చూడకు రామయ్యా` వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడంతో పాటు తొలి చిత్రం ఈగ` తో నేషనల్ స్థాయి అవార్డు చేజిక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్ వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ వారాహిచలనచిత్రం బ్యానర్ పై సాయిశివాని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నందరమూరి తారకరత్న విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ లాంచ్ కార్యక్రమం విజయవాడలో జరిగింది. టి.ఎన్.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో రవినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నారా, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. ఈ మార్చి 25న విజయవాడలో జరగనున్న ఆడియో వేడుకకు భారీ ఎత్తున్న సన్నాహాలు చేస్తున్నట్లు అభిమానులు తెలియజేశారు.​

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.