close
Choose your channels

మ‌రో రంగంలోకి ర‌కుల్‌

Saturday, September 14, 2019 • తెలుగు Comments

మ‌రో రంగంలోకి ర‌కుల్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ర‌కుల్ సినిమా రంగంతో పాటు ఫిట్‌నెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఎఫ్ 45 అనే జిమ్‌ను స్టార్ట్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఈమె మ‌రో కొత్త రంగంలోకి అడుగు పెట్టింది. అదే క్రీడా రంగం. తాజాగా టెన్నిస్ ప్రీమియ‌ర్ లీగ్‌లోకి ర‌కుల్ అడుగు పెట్టింది. హైద‌రాబాద్ స్ట్రైక‌ర్స్ పేరుతో ఆడుతున్న అంకితా రైనా అండ్ టీంను ర‌కుల్ ప్రీత్ సింగ్ కొనుగోలు చేసింద‌ట‌. ఈమెకు తోడుగా ఆమె సోద‌డు అమ‌న్ ఎలాగూ ఉన్నాడు. అండర్ 14, అండ‌ర్ 18 గ్రూపుల‌కు చెందిన టెన్నిస్ ఫ్రాంచైజీని ఇప్పుడు ర‌కుల్ సొంతం. ఇత‌ర టీమ్‌ల‌తో వీరు పోటీ ప‌డ‌తారు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ క్ర‌మంగా ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా మారుతుంది.

`ఎన్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, `దేవ్‌`, దే దే ప్యార్ దే`, `ఎన్‌.జి.కె`, `మ‌న్మ‌థుడు 2` చిత్రాల్లో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఈ ఏడాది తెర‌పై సంద‌డి చేసింది. వీట‌న్నింటీలో బాలీవుడ్ చిత్రం `దే దే ప్యార్ దే` మాత్ర‌మే ర‌కుల్‌కు చాలా మంచి పేరుని తెచ్చిపెట్టింది. మిగిల‌న‌వేవీ ఈమెకు పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఇది కాకుండా మ‌రో రెండు త‌మిళ సినిమాలు.. ఇండియ‌న్ 2 లో కూడా న‌టిస్తుంది. ర‌కుల్‌. తెలుగు సినిమాల్లో ర‌కుల్ న‌టించ‌డం లేదు. చేస్తున్న మూడు సినిమాలూ త‌మిళంలోనే కావ‌డం విశేషం.

Get Breaking News Alerts From IndiaGlitz