close
Choose your channels

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి..

Friday, December 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు చ‌ర‌ణ్‌. జ‌న‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తిక‌ర‌మైన వార్త వినిపిస్తోంది. అదేమిటంటే.. ఇందులో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ట‌. ఇదివ‌ర‌కు చ‌ర‌ణ్‌.. మ‌గ‌ధీర సినిమాలో రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేశారు. అలాగే నాయ‌క్ చిత్రంలోనూ డ్యూయెల్ రోల్ చేసి మెప్పించారు. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ స‌క్సెస్ అయిన చెర్రీ.. మూడో ప్ర‌య‌త్నంలోనూ సూప‌ర్ హిట్ కొడ‌తారేమో చూడాలి.

త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ర‌మ్య‌కృష్ణ‌, వివేక్ ఒబెరాయ్ కూడా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచార‌మ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.