close
Choose your channels

Ram Charan:ఆ నాలుగు సినిమాలు నా ఫేవరేట్.. అమెరికన్ హోస్ట్‌తో చరణ్ , అవేంటో తెలుసా..?

Thursday, March 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కార్ కొట్టి తీరాలన్న కసితో జక్కన్న పనిచేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాతో పాటు హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా అమెరికాకు వెళ్లారు. అక్కడి మీడియాతో చెర్రీ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన సినిమాలు ఏవి అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు చరణ్ చెప్పిన సమాధానాలు వైరల్ అవుతున్నాయి. తనకు ది నోట్‌బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ తన ఫేవరేట్ అని చెప్పారు. ఇక భారతీయ చిత్రాల విషయానికి వస్తే.. దానవీర శూరకర్ణ, బాహుబలి, రంగస్థలం, మిస్టర్ ఇండియా తనకు ఇష్టమని రామ్‌చరణ్ పేర్కొన్నారు.

అమెరికన్ మీడియాలో మెరుస్తోన్న చరణ్:

ఇకపోతే..లాస్ ఏంజిల్స్‌లో అకాడమీ అవార్డ్స్‌కు ముందు ఆర్ఆర్ఆర్ కోసం ప్రమోషనల్, అవార్డ్స్ సీజన్ టూర్‌లో వున్న రామ్‌చరణ్ మంగళవారం మరో టీవీ చాట్ షోలో అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా అతనిని సదరు టీవీ హోస్ట్.. రామ్‌చరణ్‌ను ‘‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’’ అంటూ సంబోధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఎల్‌టీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కనిపించారు చెర్రీ. ఆర్ఆర్ఆర్ గురించి సామ్ రూబిన్, ఫ్రాంక్ బక్లీ, జెస్సికా హోమ్స్, మార్క్ క్రిస్కీలతో మాట్లాడుతుండగా.. హోస్ట్ చెర్రీని ‘‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’’ అని సంభోదించారు.

తన కోసం ఆర్ఆర్ఆర్ చూడమన్న చరణ్:

మరి ఈ గౌరవం మీకు ఎలా వుందని హోస్ట్ ప్రశ్నించగా.. చెర్రీ స్పందించారు. తనకు ఆ గౌరవం ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ షోలో రామ్‌చరణ్‌ని బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అవార్డ్ గెలిస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా వుంటుందని ప్రశ్నించారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. ఆ ట్రోఫీని భారతదేశానికి తీసుకెళ్లడానికి క్షణం కూడా ఆలస్యం చేయనన్నారు. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కానుండటంతో.. మీరంతా ఖచ్చితంగా తమ కోసం కొంత సమయం కేటాయించాలని రామ్‌చరణ్ కోరారు.

అంతర్జాతీయ అవార్డ్‌లు కొల్లగొడుతున్న చరణ్:

ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల్లో పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఇక.. ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.