close
Choose your channels

పూరిని డైరెక్ట్ చేసిన రామ్

Wednesday, July 31, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూరిని డైరెక్ట్ చేసిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ను సాధిస్తూ ముందుకెళుతోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి రివీల్ అయ్యింది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌లో ఓ చోట పూరి కూడా కనపడతారు కదా.. ఆ సన్నివేశాన్ని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు.. హీరో రామ్. దీనికి సంబంధించిన వీడియోను చార్మి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

`హీరో రామ్ కొత్త యాక్టర్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు` అంటూ చార్మి మెసేజ్ పోస్ట్ చేయగా.. `పూరి జగన్నాథ్ అనే కొత్త కుర్రాడు.. యాక్టింగ్ ఇరగదీశాడు` హీరో రామ్ దాన్ని రీ ట్వీట్ చేశారు. దీనిపై ఫన్నీ పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. `సార్ నెక్ట్స్ టైమ్ కొంచెం పెద్ద రోల్ ఇవ్వండి ప్లీజ్` అంటూ పోస్ట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.