close
Choose your channels

పోర్న్ స్టార్ రమ్యకృష్ణ

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోర్న్ స్టార్ రమ్యకృష్ణ

హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ 'బాహుబలి' చిత్రంలో పోషించిన శివగామి పాత్ర ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆర్టిస్ట్‌గా మరింత బిజీ అయ్యారు. తాజాగా ఓ తమిళ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నారు. విజయ్ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు 'సూపర్ డీలక్స్'.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్‌లో కనిపిస్తారు. రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనుంది. ముందుగా ఈ పాత్ర కోసం నదియాను సంప్రదించారు. ఈ క్యారెక్టర్ చేయడానికి ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నారు. సమంత ఈ సినిమాలో రెండు గెటప్స్‌లో కనిపిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.