close
Choose your channels

ఏ నటి కూడా ఇలాంటి పాత్ర చేయలేదు - రమ్యశ్రీ

Monday, April 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రమ్యశ్రీ ప్రధానపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ఓమల్లి`. ఆర్.ఎ.ఎంటైర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ఏప్రిల్ 15న విడుదల అవుతుంది.

ఈసందర్భంగా...

రమ్య శ్రీ తన సినిమా విశేషాలను గురించి మాట్లాడుతూ `నేను పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒక ఘటనను చూశాను. ఆ ఘటన నా మనసులో అలాగే నిలిచిపోయింది. నేటి సమాజంలో ఆడవాళ్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిపై నేను సినిమా చేయాలనుకోగానే ఈ ఘటన నా మదిలో మెదిలింది. దాన్ని స్క్రిప్ట్ గా మలిచాను. మెసేజ్, కమర్షియల్ గా సినిమాను తెరకెక్కించాను. ఒకవైపు నిర్మిస్తూ, దర్శకత్వం చేశాను. నటించాను. చాలా కష్టపడ్డాను.

అయితే అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాను చూసిన వాళ్ళందరూ చాలా బావుందని అంటున్నారు. ఏ నటి కూడా ఇలాంటి రోల్ చేయలేదని చాలెంజ్ చేసి చెప్పగలను. సినిమా రిలీజ్ సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలు, తర్వాత థియేటర్స్ సమస్య కారణంగా సినిమాను రిలీజ్ చేయడంలో ఆలస్యమైంది. అయితే కొన్ని రోజులు వెయిట్ చేయడంతో సినిమాను వంద థియేటర్స్ లో విడుదల చేస్తున్నాను. సినిమాను తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాను. దీని తర్వాత మరో మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.