close
Choose your channels

వేసవిలో రానా సందడి

Thursday, January 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రొటీన్ కథలకి భిన్నంగా కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని సాగిస్తున్న నటుడు రానా. లీడర్`, ఘాజి`, బాహుబలి` నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన సినిమాలతో విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం రానా.. చారిత్రాత్మ‌క‌ చిత్రం 1945`లో నటిస్తున్నారు. ఈ సినిమాని యుద్ధం నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రంగా తెలుగు, తమిళం భాష‌ల్లో బైలింగ్వల్ మూవీగా సత్యశివ తెరకెక్కిస్తున్నారు.

ఇందులో.. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన “ఆజాద్ హింద్ ఫౌజ్`లో ఒక సైనికుడిగా కనిపించనున్నారు రానా. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో నాజర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రెజీనా కథానాయికగా నటించిన ఈ సినిమాని ఎస్.ఎన్. రాజరాజన్ (బాహుబలి తమిళ్ వెర్షన్ నిర్మాత) నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక‌కాలంలో విడుదల చేయనున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో రానా ఖాతాలో మ‌రో విజ‌యం చేరుతుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.