close
Choose your channels

‘ఆకాశ‌వాణి’ యూనిట్‌కు రానా సపోర్ట్

Sunday, August 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే. దీనికి అచ్చ తెలుగు పేరు ఆకాశ‌వాణి. వార్త‌లు, పాట‌లు ఇలా అన్నీ విష‌యాల‌ను సామాన్యుల‌ను అందించే ఈ ఆకాశ‌వాణి పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతుంది. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను హీరో రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆదివారం విడుద‌ల చేశారు. ‘ఆకాశవాణి’ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

గొర్రెల కాప‌రి అయిన ఓ చిన్న పిల్లాడు మ‌ర్రిచెట్టు ఊడ‌ను ప‌ట్టుకుని త‌ల‌క్రిందులుగా వేలాడుతుంటే, మ‌రో ఊడ‌కు క‌ట్టి ఉన్న‌ ఆకాశ‌వాణి కూడా అటూ ఇటూ ఊగుతుంది. చెట్టు ద‌గ్గ‌ర గొర్రెలున్నాయి. ఈ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చూస్తుంటేనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ పీరియాడిక్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి  ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.