close
Choose your channels

రానా మ్యారేజ్‌ డేట్ ..!

Saturday, May 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రానా ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఖ‌రారైంది..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి. ఈ పాన్ ఇండియా న‌టుడు, మిహీకా బ‌జాజ్‌ను పెళ్లి చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌కు రోకా కూడా జ‌రిగింది. అయితే పెళ్లి డేట్‌పై ఆ స‌మ‌యంలో రెండు కుటుంబాల‌కు చెందిన వారెవ‌రూ అప్పుడు స్పందించ‌లేదు. తాజా స‌మాచారం మేర‌కు రానా, మిహీకల మ్యారేజ్‌ ఆగ‌స్ట్ 8న హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

రానా ప్రేమ గురించిన విష‌యాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన‌ప్పుడు రానా తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు రానా పెళ్లి ఈ ఏడాది చివ‌ర‌లో ఉంటుంద‌ని చెప్పారు. ఆ ప్ర‌కారం డిసెంబ‌ర్‌లో రానా, మిహీక పెళ్లి జ‌ర‌గ‌నుందని అంద‌రూ అనుకున్నారు.అయితే ఆగ‌స్ట్ 8నే వీరికి పెళ్లి చేయాల‌ని ఇరు కుటుంబాల పెద్ద‌లు అనుకున్నార‌ట‌. అయితే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం మాత్రం రాలేదు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రానా హీరోగా న‌టించిన అర‌ణ్య విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మ‌రో ప‌క్క సాయిప‌ల్ల‌వితో క‌లిసి విరాట‌ప‌ర్వం చిత్రంలో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

రానా ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఖ‌రారైంది..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.