close
Choose your channels

రవితేజ ముహుర్తం ఫిక్సయ్యింది....

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఈ ఏడాది సినిమాలేవీ విడుద‌ల చేయ‌ని మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు విక్ర‌మ్‌సిరి ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపుబుజ్జి నిర్మాత‌గా సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ‌, త‌న‌తో ప‌వ‌ర్ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని చుట్టాల‌బ్బాయి నిర్మాత‌ల్లో ఒక‌రైన రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తాడ‌ని టాక్‌. ఈ సినిమాను అక్టోబ‌ర్ 12న లాంచ‌నంగా ప్రారంభిస్తార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదినే రిలీజ్ అవుతాయి కాబట్టి రవితేజ సినిమా ఈ ఏడాది లేనట్లే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.