close
Choose your channels

అఫీషియల్‌.. రవితేజ 'ఖిలాడి'

Sunday, October 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఫీషియల్‌.. రవితేజ ఖిలాడి

మాస్‌ మహారాజా రవితేజ 67వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి 'ఖిలాడి' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రవితేజ బ్లాక్‌డ్రెస్‌లో స్టెప్‌ వేస్తుండగా అతని చుట్టూ డబ్బులు ఎగురుతున్నాయి. 'ప్లే స్మార్ట్‌' సినిమా ట్యాగ్‌లైన్‌. రవితేజ డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సందర్భంగా ``ఖిలాడి సినిమా ఫస్ట్‌లుక్‌. మరో ఎగ్జయిటింగ్‌ జర్నీకి అంతా సిద్ధమైంది`` అని రవితేజ అన్నారు. ``ఖిలాడిలో ఇప్పటి వరకు కనిపించని రవితేజను చూస్తారు. అద్వితీయమైన టాలెంట్‌ ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు`` కావాలంటూ డైరెక్టర్‌ ట్వీట్‌ చేశారు. ``నా తదుపరి చిత్రం మాస్‌ మహారాజా రవితేజతో ఖిలాడి. సరికొత్త పాత్రలో కనిపించనున్నాం. గొప్ప టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. మీ ఆశీర్వాదాలు కావాలి`` అని డింపుల్‌ హయతి అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.