close
Choose your channels

'కిమ్ చనిపోవడం' అంతా డ్రామానే.. అసలు కారణాలివీ..

Wednesday, May 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కిమ్ చనిపోవడం అంతా డ్రామానే.. అసలు కారణాలివీ..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కిమ్‌కు గుండె సంబంధ ఆపరేషన్‌ జరిగినట్లు.. సర్జరీ తర్వాత కిమ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వినిపించాయి. అతిగా స్మోకింగ్ చేయడం, లావు ఎక్కువగా ఉండటంతో ఒబెసిటితో కిమ్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు వార్తలొచ్చాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా వెలువడ్డ వరుస వార్తలు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. అంతేకదా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వార్తే ఎక్కువగా హైలైట్ అయ్యింది కూడా. అయితే ఇలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన కొద్దిరోజులకే ఓ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ దగ్గర తన సోదరితో కలిసి కిమ్ దర్శనమిచ్చారు. దీంతో ఆ దేశ ప్రజలు.. యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఇదేంటి ‘హుర్రే’ అంటూ ఆశ్చర్యపోయింది. అసలు ఎందుకిలా పుకార్లు సృష్టించారు..? దీనివెనుక ఏమైనా బలమైన కారణాలున్నాయా..? అనే పలు పత్రికలు ఆరాతీయగా కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

ఇవీ అసలు కారణాలు..

అసలు కిమ్ అనే వ్యక్తి మరణిస్తే దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి? దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఏయే అగ్రరాజ్యాల అధినేతలు కుట్ర చేస్తారు..? స్వదేశంలో ఎవరు కుట్రలు చేస్తారు? వంటి అంశాలను తెలుసుకోవడానికే ఈ డ్రామా ఆడారని తెలియవచ్చింది. అయితే.. 20 రోజులపాటు సాగిన ఈ నాటకంలో ఎవరెవరు, ఎలాంటి కుట్రలు చేశారు..? అనే విషయాలను కిమ్ తెలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి ఆటలు కట్టించేందుకు.. వారి అంతు చూసేందుకు కిమ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలియవచ్చింది. అయితే.. కిమ్ ఆడిన ఈ హైడ్రామా కేవలం అతికొద్ది మంది అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసని సమాచారం.

వీటి పరిస్థితేంటో..!

కాగా.. కిమ్ ఆరోగ్య పరిస్థితి సర్లేదన్న వార్తలు విన్న మరుక్షణమే అమెరికాతో పాటు పలు అగ్రదేశాలు రంగంలోకి దిగాయని వార్తలు వినిపించాయి. బద్ధశత్రువులంతా ఒక్కటై కొరియాను ఆక్రమించుకోవాలనే ప్రయత్నాలు కూడా జరిగాయని పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా ఉత్తర కొరియాపై అమెరికా ప్రత్యేక దృష్టిసారించిందని కూడా వార్తలొచ్చాయ్. అంతే కాదు అక్కడ అసలేం జరుగుతోందని అమెరికా నిఘా సంస్థ అనుక్షణం ఆరాతీసిందని వార్తలు వచ్చాయి. మరి వీటన్నింటిపై కిమ్ ఎలా రియాక్ట్ అవుతారు..? ఏం చేయబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిమ్ ఎంతటి పని చేయడానికి అస్సలు వెనుకాడడని.. చాలా క్రూరుడని పలు సందర్భాల్లో నిరూపితమైన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.