close
Choose your channels

ఆ పుకారు ఎవరు పుట్టించారో కానీ..: రేణు దేశాయ్

Monday, June 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ పుకారు ఎవరు పుట్టించారో కానీ..: రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఓ సినిమాలో నటిస్తున్నారంటూ పుకారు షికారు చేసింది. దీంతో ఆమెకు కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వెళ్లాయి. దీంతో ఆమె స్పందించారు. అసలు విషయం ఏంటంటే.. అడవి శేష్ హీరోగా మహేష్‌బాబు సొంత బ్యానర్ ఏఎంబీ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ నటించనున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా రేణు స్పందించారు.

తాను అడవి శేష్ చిత్రంలో నటిస్తున్నాననే పుకారు ఎవరు పుట్టించారో కానీ.. అప్పటినుంచి తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. కాగా.. తాను ఆ సినిమాలో నటించడం లేదని.. ఏదైనా సినిమాకు సైన్ చేస్తే తానే స్వయంగా వెల్లడిస్తానని రేణు దేశాయ్ తెలిపారు. ప్రస్తుతం రేణు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తెగ బిజీ అయిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.