close
Choose your channels

మల్టీస్టారర్ లో రేయ్ భామ

Wednesday, October 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిధరమ్ తేజ్ తొలి చిత్రం రేయ్` విడుదల్లో జాప్యం జరిగి రెండో చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సయామీ ఖేర్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..బాలీవుడ్ బ్యూటీని తర్వాత అవకాశాలు పలకరించలేదు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ అమ్మడు, కార్తీ, నాని హీరోలుగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న రీవేంజ్ డ్రామా లో దర్శనమీయనుంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలే కన్ ఫర్మ్ చేశాయి.

అయితే హీరోయిన్ గా నటిస్తుందా లేదా కీలకపాత్రలో చేస్తుందా అనేది తెలియలేదు. ప్రస్తుతం మిర్జియా` అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సయామీకి మణిరత్నం ఎలాంటి బ్రేక్ ఇస్తాడో చూడాల్సిందే...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.