close
Choose your channels

పోర్న్ స్టార్‌తో వ‌ర్మ సినిమా...

Wednesday, May 13, 2020 • తెలుగు Comments

పోర్న్ స్టార్‌తో వ‌ర్మ సినిమా...

క‌రోనా దెబ్బ‌కు సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. సినిమా థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇలాంటి త‌రుణంలో సినిమా షూటింగ్స్ చేయ‌డానికే ద‌ర్శ‌క నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. కానీ వ‌ర్మ మాత్రం క‌రోనాను భ‌యాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా అంటే అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారంటూ దానిపై రెండు పాట‌ల‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఈసారి మ‌రో అడుగు ముందుకేసి సినిమాను రూపొందించేస్తున్నాడు. అది కూడా ఏకంగా పోర్న్ స్టార్‌తో కావ‌డం విశేషం. ఈ వివ‌రాల‌ను వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

గ‌తంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గాడ్ అంటూ సెక్స్ ట్రూత్ అనే సినిమాను తెర‌కెక్కించిన వ‌ర్మ ఈసారి క్లైమాక్స్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను గురువారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నామ‌ని వ‌ర్మ త‌న ట్వీట్‌లో తెలియ‌జేశారు. ఆర్ఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రేయాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాన‌ని వ‌ర్మ తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz