close
Choose your channels

‘ఆర్ఆర్ఆర్’.. రికార్డ్ స్థాయిలో అమ్ముడైన డిజిటల్ హక్కులు!

Thursday, March 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆర్ఆర్ఆర్’.. రికార్డ్ స్థాయిలో అమ్ముడైన డిజిటల్ హక్కులు!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఒకవైపు జక్కన్న, మరోవైపు ఇద్దరూ స్టార్ హీరోలే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్.

ముఖ్యంగా ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్‌ అయినట్లుగా తెలుస్తుంది. ఈ డిజిటల్ హక్కులను స్టార్ నెట్‌వర్క్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. రూ. 200 కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడుపోయాయని సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్‌ హక్కులకు భారీ పోటీ ఏర్పడగా.. చివరికి స్టార్‌ నెట్‌వర్క్‌ వారు రూ. 200 కోట్లకు ఆ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే మాత్రం అది పెద్ద రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకూ ఏ హీరోకూ దర్శకుడిగా దక్కలేదని తెలుస్తోంది.

మరోవైపు జక్కన్న కూడా మేకింగ్‌ విషయంలో ఎక్కడా రాజీ పడటంలేదు జక్కన్న. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉండాలని ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌నే రంగంలోకి దింపారు. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ అంటూ చిత్రయూనిట్ అధికారికంగా ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటిస్తున్నాడు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్‌ 13న ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.