close
Choose your channels

సాయిధరమ్ సంగతి ఏమిటో?

Tuesday, April 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ఫ్యామిలీ నుంచి క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. 'రేయ్‌'తో తొలి అడుగులు వేసిన సాయి.. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' చిత్రాల‌తో చెప్పుకోద‌గ్గ విజ‌యాల‌ను త‌న సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగో చిత్రంగా 'సుప్రీమ్' చేస్తున్నాడు. 'ప‌టాస్' ఫేం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

అంతేకాదు.. మెగా ఫ్యామిలీకి నాలుగో సినిమా అంటే హిట్ గ్యారంటీ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో రుజువైంది. ప‌వ‌న్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన‌ 'తొలి ప్రేమ' అత‌ని నాలుగో సినిమా అయితే.. 'ఆరెంజ్' వంటి డిజాస్ట‌ర్‌ త‌రువాత చ‌ర‌ణ్‌కి ఊర‌ట‌నిచ్చిన 'ర‌చ్చ' అత‌నికి నాలుగో చిత్రం. కానీ అల్లుఅర్జున్ నాలుగో చిత్రం హ్యపీ బక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అనకున్న ఫలితాన్ని రాబట్టుకోలేక పోయింది. మరి వీరి బాట‌లోనే సాయిధ‌ర‌మ్ కి అత‌ని నాలుగో చిత్రం 'సుప్రీమ్' మంచిహిట్ చిత్రంగా నిలుస్తుందో, లేదో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు. 'సుప్రీమ్' వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.