close
Choose your channels

ఉక్రెయిన్ లో విన్న‌ర్..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం విన్న‌ర్.ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసే పోరాట‌మే విన్న‌ర్ క‌థాంశం.

ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. నవంబ‌ర్ లో ఉక్రెయిన్ లో పాట‌ల్ని, ఇస్తాంబుల్ లో క్లైమాక్స్ ని చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌హాశివరాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు ఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.