close
Choose your channels

సమంత చేతుల మీదుగా రిలీజైన రెమో ఆడియో..!

Tuesday, November 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ రెమో. ఈ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ మ్యూజిక్ అందించిన రెమో చిత్రం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి క‌థానాయిక స‌మంత ముఖ్య అతిథిగా హాజ‌రై రెమో ట్రైల‌ర్ & ఆడియోను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.... త‌మిళ్ లో సినిమా రిలీజైన త‌ర్వాత కూడా ఇంత కొత్త‌గా ఈవెంట్ చేయ‌చ్చు అని రాజా నిరూపించారు. ఈ సినిమా త‌మిళనాడులో స‌క్సెస్ అయి ఎలాంటి రెవెన్యూ క‌లెక్ట్ చేస్తుందో చూసాం. తెలుగులో కూడా ఆద‌రిస్తార‌ని 100% న‌మ్మ‌కం. శివ కార్తీకేయ‌న్ కి ఈ సినిమా తెలుగులో మంచి ఎంట్రీ అవుతుంది. నేను చెప్పేది అన్నీ నిజాలు. తెలుగులో సాంగ్స్ అన్ని రికార్డ్ అయిన త‌ర్వాత అనిరుథ్ నాకు పంపించారు. డ‌బ్బింగ్ సాంగ్స్ లా కాకుండా స్ర్టైయిట్ ఫిల్మ్ సాంగ్స్ లా చేసారు. ఎ.ఆర్ రెహ‌మాన్ ఒక్క‌రే డ‌బ్బింగ్ అనే ఫీల్ లేకుండా పాట‌లు అందించేవారు. ఇప్పుడు అనిరుధ్ కూడా అలాగే పాట‌లు అందించాడు. ఈ సినిమా హీరోయిన్ కీర్తి మా సినిమా నేను లోక‌ల్ లో న‌టిస్తుంది. ఈ ఈవెంట్ కు ఛీఫ్ గెస్ట్ గా వ‌చ్చిన స‌మంత కు థ్యాంక్స్. ఈ సినిమాను ఖ‌చ్చితంగా అంద‌రూ ఎంజాయ్ చేస్తారు అన్నారు.

డైలాగ్ రైట‌ర్ రాజేష్ మాట్లాడుతూ... ఈ సినిమాకి డైలాగ్స్ రాయ‌డం అంటే పెద్ద భారం అనేది నా ఫీలింగ్. అయినా.... నా వ‌ర‌కు నేను అంద‌రికి న‌చ్చేలా రాసాను అనుకుంటున్నాను. ఇది నాకు రెండో సినిమా. నా మొద‌టి ఆడియో లాంఛ్ ఇది. శివ కార్తికేయ‌న్, కీర్తి సురేష్ సూప‌ర్ గా న‌టించారు. దిల్ రాజు గారు చెప్పిన‌ట్టుగా ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అన్నారు.

కె.ఎస్.ర‌వికుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ కృష్ణ గారి సినిమాలు చూసేవాడిని. తెలుగు వాళ్లు చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. చెన్నైని తెలుగు ఇండ‌స్ట్రీ మ‌ర‌చిపోయింది కానీ తెలుగు ఆడియోన్స్ చెన్నైని మ‌ర‌చిపోలేదు. అందుక‌నే త‌మిళ సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. శివ కార్తీకేయ‌న్ కూడా ఇక్క‌డ పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమాలో ఎంట‌ర్ టైన్మెంట్, సాంగ్స్, ఎమోష‌న్..ఇలా ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. అనిరుథ్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. నేను కూడా ఈ సినిమాలో న‌టించాను. భామ‌నే స‌త్య‌భామ‌నే సినిమాకి నేనే డైరెక్ష‌న్ చేసాను. అది మోచ్యూర్డ్ ల‌వ్ స్టోరీ. ఇది డిఫ‌రెంట్ మూవీ. తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆద‌రించి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

శ‌ర‌ణ్య మాట్లాడుతూ.... రెమో టీమ్ అంద‌రికి ఆల్ ది బెస్ట్. ఖ‌చ్చితంగా రెమో సక్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ స‌తీష్ మాట్లాడుతూ.... ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గార్కి థ్యాంక్స్. త‌మిళ్ వ‌లే తెలుగులో కూడా మంచి సాంగ్స్ అందించిన అనిరుథ్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

గీత ర‌చ‌యిత శ్రీమ‌ణి మాట్లాడుతూ... శ‌త‌మానంభ‌వ‌తి సినిమాలో ఓ పాట రాసాను. ఆ పాట దిల్ రాజు గార్కి బాగా న‌చ్చింది. వెంట‌నే ఈ సినిమాలో పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చారు. రెమో త‌మిళ్ మూవీకి పాట‌లు రాసిన విఘ్నేష్ సార్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఎందుకంటే త‌మిళ్ వెర్షెన్ లోని సాంగ్స్ విన్న త‌ర్వాత‌ తెలుగులో ఇంకా బాగా రాయాలి అనే స్పూర్తి క‌లిగింది. అలాగే వండ‌ర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన
అనిరుథ్ కి థ్యాంక్స్. రెమో మూవీని నేను ప్రేమించాను అంద‌రూ ప్రేమిస్తారు అనుకుంటున్నాను. ఈ మూవీలోని పి.సి.శ్రీరామ్ గారి కెమెరా వ‌ర్క్ అద్భుతంగా ఉంది. శివ కార్తికేయ‌న్ & టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ మాట్లాడుతూ... ఈ మూవీకి వ‌ర్క్ చేయ‌డం ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. ఈ సినిమాకి వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌కు రావ‌డం ఆనందంగా ఉంది. ఈ మూవీ డైరెక్ట‌ర్ స‌తీష్ నాకు మంచి ఫ్రెండ్. కీర్తి అద్భుతంగా న‌టించింది. ఈ ఫంక్ష‌న్ కు వ‌చ్చినందుకు నా ఫ్రెండ్ స‌మంతకి థ్యాంక్స్. శ్రీమ‌ణి మంచి లిరిక్స్ అందించారు. త్వ‌ర‌లో తెలుగు మూవీకి సంగీతం అందించ‌నున్నాను. శివ కార్తికేయ‌న్ ని ఆద‌రించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

స‌మంత మాట్లాడుతూ.... ప్ర‌మోష‌న్స్ చూస్తుంటే స్టైయిట్ తెలుగు ఫిల్మ్ లానే ఉంది. శివ కార్తికేయ‌న్ చాలా మంచి వ్య‌క్తి. అందుక‌నే ఈ ఆడియో వేడుక‌కు వ‌చ్చాను. కంగ్రాట్స్ టు కీర్తి సురేష్‌. తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసి వ‌దిలేసి వెళ్లిపోయాడు అనిరుథ్‌. ఈసారి అలా జ‌ర‌గ‌కుండా చూస్తాను. ఒక‌వేళ ఈసారి కూడా తెలుగులో సినిమా చేయ‌క‌పోతే నేనే కిడ్నాప్ చేసి మ‌రి తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించేలా చేస్తాను. అనిరుథ్ నా ఫేవ‌రేట్ కంపోజ‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.త‌మిళ్ లో రాజా గారి బ్యాన‌ర్ లో నేను సినిమా చేయ‌బోతున్నాను అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ... దిల్ రాజు గారి బ్యాన‌ర్ లో నా రెండో సినిమా చేస్తున్నాను. త‌మిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మించిన రాజా సార్ కి థ్యాంక్స్.
శివ కార్తికేయ‌న్ కి తెలుగులో బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ అవుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ.... ఇది బెస్ట్ ఫిల్మ్. త‌మిళ్ లో రాజా నిర్మిస్తే...తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు అన్నారు.

హీరో శివ కార్తికేయ‌న్ మాట్లాడుతూ.... అనిరుథ్ నాకు మంచి ఫ్రెండ్. న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నాడు. కీర్తి సురేష్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించింది. ఇది క‌ల‌ర్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ చిత్రంలోని కీర్తి సురేష్ ఏక్టింగ్, పి.సి.శ్రీరామ్ విజువ‌ల్స్, ఎంట‌ర్ టైన్మెంట్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. రెమో ఈనెల‌లో రిలీజ్ అవుతుంది. నేను చూసిన ఫ‌స్ట్ తెలుగు మూవీ బొమ్మ‌రిల్లు. ఈ చిత్రాన్ని స్ట్రైయిట్ మూవీలా రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.