close
Choose your channels

స‌మంత ఆ ట్రాక్ రికార్డు సొంతం చేసుకుంటుందా?

Wednesday, June 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌మంత ఆ ట్రాక్ రికార్డు సొంతం చేసుకుంటుందా?

అఆ, జ‌న‌తా గ్యారేజ్‌, రాజుగారి గ‌ది2, మెర్స‌ల్ (అదిరింది), రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, ఇరుంబు తిరై (అభిమ‌న్యుడు).. ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది అందాల న‌టి స‌మంత‌. వ‌రుస‌గా ఏడు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉంది. వాటిలో రెండు చిత్రాలు త‌మిళంలో రూపొందుతున్న‌వి కాగా.. మ‌రో సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం త‌మిళంలో క్రేజీ హీరోలైన శివ‌కార్తికేయ‌న్‌, విజ‌య్ సేతుప‌తితో వ‌రుస‌గా సీమా రాజా, సూప‌ర్ డీల‌క్స్ సినిమాలను చేస్తోంది స‌మంత‌. అలాగే తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న యూ ట‌ర్న్ సినిమాలోనూ స‌మంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది.

ఈ మూడు సినిమాలు కూడా విజ‌యం సాధిస్తే.. వ‌రుస‌గా ప‌ది విజ‌యాల‌తో ఇటీవ‌ల కాలంలో ఏ క‌థానాయిక‌కు సాధ్యం కాని ట్రాక్ రికార్డ్‌ను త‌న సొంతం చేసుకున్న‌ట్ల‌వుతుంది స‌మంత‌కి. మ‌రి.. స‌మంత ఆ ఫీట్ సాధిస్తుందో లేదో చూడాలి. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.