close
Choose your channels

సప్తగిరి నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి.. వైవిధ్యమైన కథతో..

Friday, June 25, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సప్తగిరి నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి.. వైవిధ్యమైన కథతో..

కమెడియన్ సప్తగిరి హీరోగా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. సప్తగిరి తదుపరి చిత్రం గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ కె. ఎం. కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇదీ చదవండి: అండర్ వాటర్ లో ఎమోషనల్ రొమాన్స్..'వసంత కోకిల' టీజర్

రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన పరిపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు కుమార్ తొలి చిత్రంతోనే వైవిధ్యమైన కథని ఎంచుకున్నట్లు తెలిపారు. సినిమా మంచి అవుట్ పుట్ కోసం నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా రాజీపడలేదట.

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. సప్తగిరి సరసన హీరోయిన్ గా నేహా సోలంకి నటించింది. షూటింగ్ పూర్తి కావడంతో ఇక నిర్మాణానంతర కారక్రమాలు ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టింది.

త్వరలోనే సినిమా టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రతాప్ విద్య ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. పవన్ చెన్న కెమెరామెన్ గా పనిచేసారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.