close
Choose your channels

విజయవాడలో సిద్ధార్థ హోటల్ మెనేజ్ మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో బ్లాక్ బస్టర్ 'సరైనోడు' సక్సెస్ మీట్

Thursday, May 5, 2016 • తెలుగు Comments
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేస్తూ... ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈనెల 4న విజయవాడలోని సిద్ధార్థ హోట‌ల్ మెనేజ్‌మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో  సరైనోడు సక్సెస్ సంబరాల్ని కలర్ ఫుల్ గా వేలాదిమంది అభిమానుల స‌మ‌క్షంలొ అంగ‌రంగ వైభవంగా జ‌రిపారు.  ఈ వేడుకకు అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, అల్లు అర‌వింద్‌, శ్రీకాంత్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్‌, కేథరీన్ , ఆదిపినిశెట్టి, స‌మీర్‌, ప్ర‌భాక‌ర్ లు హ‌జ‌ర‌య్యారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... విజ‌య‌వాడ తో నాకు చాలా అనుభందం వుంది. మా అత్త‌గారి ఊరు ఈ విజ‌య‌వాడ‌. నేను విజ‌య‌వాడ అల్లుడ్ని, విజ‌యాల గ‌డ్డ ఈ విజ‌య‌వాడ‌లో సూప‌ర్‌డూప‌ర్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫంక్ష‌న్ చేయ‌టం చాలా ఆనందంగా వుంది. 20 సంవ‌త్స‌రాల క్రితం శ్రీకాంత్ హీరోగా, నేను , అశ్వ‌నీద‌త్ క‌లిసి నిర్మించిన పెళ్ళిసంద‌డి చిత్రం 175 రోజుల పండుగ ఇక్క‌డే జ‌రుపుకున్నాము. మ‌ళ్ళి మా సినిమాలొ బాబాయ్ పాత్ర‌తో అల‌రించిన శ్రీకాంత్ ఈ స్టేజిమీద వుండ‌టం చాలా ఆనందంగా వుంది. మంచి కోసం మాత్ర‌మే మ‌నం వుండాలి అనే స‌రైనోడు పాత్ర బ‌న్ని నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా వుంది. బ‌న్ని అంతే మంచి జ‌ర‌గాలనిమాత్ర‌మే కోరుకుంటాడు. అందుకే ఈ చిత్రం అంత ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ సినిమా విజ‌యం లో ప్ర‌ధాన పాత్ర మా మెగా అభిమానుకే చెందుతుంది. స‌రైనోడు అనే చిత్రాన్ని వారంద‌రూ క‌ల‌సి ఈ ఘ‌న‌విజ‌యాన్ని అందించారు. ఈ ఘ‌న‌విజ‌యం మెగాస్టార్ చిరంజీవి గారి 150 చిత్ర ఘ‌న‌విజ‌యానికి తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి గారి ద‌ర్శ‌క‌త్వం, బ‌న్ని ఫెర్‌ఫార్మెన్స్‌, ఆదిపినిశే్ట్టి ఫెర్‌ఫార్మెన్స్‌, హీరోయిన్స్ గ్లామ‌ర్, థ‌మ‌న్ మ్యూజిక్‌ చిత్ర విజ‌యంలో ప్ర‌ముఖ పాత్ర పోషించాయి. అని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ..అల్లు అర‌వింద్ గారు, బ‌న్ని ఇద్ద‌రూ నా మీద చాలా న‌మ్మ‌కం పెట్టారు. వారి న‌మ్మ‌కం స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాతో నెర‌వేరింది. మా చిత్రాన్ని ఇంత‌టి ఘ‌న‌విజ‌యం మాకందించిన చిరంజీవి గారి అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు. మా ఊరు గుంటూరు ద‌గ్గ‌ర కావ‌టంతో విజ‌య‌వాడ కి త‌ర‌చూ వ‌స్తుంటాను. ఇక్క‌డ చిరంజీవి అభిమానుల నాకు తెలుసు. ఈ చిత్రంలో అడిగిన వెంట‌నే చేసి చిత్రం విజ‌యంలో పాలు పంచుకున్న శ్రీకాంత్ గారికి, ఆది కి నా స్పెష‌ల్ థ్యాంక్స్. నా రైట‌ర్స్‌, కెమెరామెన్‌, నా డైర‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్ వాల్లు చాలా క‌ష్ట‌ప‌డి చేశారు. వారంద‌రికి నా ధన్య‌వాదాలు. బ‌న్ని నాకు హీరో, బ్ర‌ద‌ర్ కంటే ఎక్కువ‌. నేను ద‌ర్శ‌కుడు అవ్వ‌టంలో బ‌న్ని పాత్ర వుంది. మా కాంబినేష‌న్ లో వ‌చ్చే మ‌రో చిత్రం దీని మించి వుంటుంది. అన్నారు.
 
అల్లు అర్జున్ మాట్టాడుతూ..స‌రైనోడు చిత్రం 100 కోట్లు గ్రాస్ చేయ‌టం నా చిత్ర‌ల్లో ఇది బెస్ట్ గా నిల‌వ‌టం చాలా ఆనందంగా వుంది. నన్ను అభిమానించే మెగా అభిమానుల‌కి, ఇత‌ర రాష్ట్రంలో ని న‌న్ను ప్ర‌త్యేఖంగా అభిమానించే వారే కాకుండా ఇంకా సినిమాని అభిమానించే ప్రేక్ష‌కులంద‌రి అశీర్వాదాలు నాకున్నాయి. నేను కొంత‌మందిని డైరెక్ట్ గా క‌ల‌వ‌క పోవ‌చ్చు కాని వారి ఆశీర్వాదం నాకు ద‌క్కుతుంది అనేదానికి నిద‌ర్శ‌నం స‌రైనోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌ట‌మే. నా చిత్రం 100 కోట్లు గ్రాస్ రావ‌టం అది కూడా మా నాన్న గారి బ్యాన‌ర్ లో రావ‌టం కిక్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి 150 వ చిత్రం 150 కొట్లు షేర్ చేయ్యాల‌నేది నాకోరిక‌. మెన్న డైర‌క్ట‌ర్ వినాయ‌క్ గారికి అదే చెప్పాను. చిరంజీవి గారి మాస్ చిత్రాలు చూసి పెరిగాను. అన్ని మాస్ చిత్రాలు చెయ్య‌లేదు కాని మాస్ అంటే చాలా ఇష్టం. బోయ‌పాటి శ్రీను గారు నాకు ఊర‌మాస్ అనే టైటిల్ ఇచ్చినందుకు చాలా హ్య‌పిగా వుంది. అలానే బోయ‌పాటి గారు యూనివ‌ర్స‌ల్ డైర‌క్ట‌ర్ అన‌టానికి నిద‌ర్శ‌నం స‌రైనోడు చిత్రం ఫ్యామిలి ఆడియ‌న్స్ బాగా ఎంజాయ్ చేయ‌ట‌మే. కేథ‌రిన్ , ర‌కూలో ఇద్దరూ చాలా మంచి తెలివైన అమ్మాయిలు. శ్రీకాంత్ గారు మా ఫ్యామిలి మెంబ‌ర్ అని గ‌ర్వంగా చెప్తాను. ఆది పినిశేట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంచి పేరు వచ్చింది. అంద‌రూ క‌ష్ట‌ప‌డి చేసిని ఈ చిత్రం ఇంత‌టి ఘ‌న‌విజ‌యం చేసినందుకు మెగా అభిమానుల‌కి మా ధ‌న్య‌వాదాలు.. అని అన్నారు

Get Breaking News Alerts From IndiaGlitz