close
Choose your channels

మెగాస్టార్ ని ఇంప్రెస్ చేసిన సయేషా....

Monday, July 4, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని అఖిల్ తొలి చిత్రం అఖిల్ ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బాలీవుడ్ భామ స‌యేషా సైగ‌ల్. తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో ఆడ‌క‌పోవ‌డంతో స‌యేషాకి ఆశించినంత‌గా టాలీవుడ్ లో అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపు దృష్టి పెట్టి అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న శివ‌య్ అనే చిత్రంలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఈ చిత్రం దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే....ఇటీవ‌ల సింగ‌పూర్ లో జ‌రిగిన సైమా వేడుక‌లో స‌యేషా స్టేజ్ ప‌ర్ ఫార్మెన్స్ తో అంద‌ర్ని ఆక‌ట్టుకుంది. అఖిల్ సినిమాలో త‌న టాలెంట్ చూపించే అవ‌కాశం అంత‌గా రాలేదు. అందుచేత త‌న టాలెంట్ చూపించ‌డానికి సైమా స‌రైన వేదిక అనుకుని స‌యేషా అద‌ర‌గొట్టేసింది. ఈ వేడుక‌లో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ చిత్రాల్లోని పాట‌ల‌కు స్టేజ్ పై డ్యాన్స్ చేసి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది.
చిరంజీవి ఘ‌రానా బుల్లోడు చిత్రంలోని బంగారు కోడిపెట్ట‌, ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా, బాల‌కృష్ణ సింహ చిత్రంలోని సింహ‌మంటి చిన్నోడే.., స‌మ‌ర‌సింహారెడ్డి చిత్రంలో నంద‌మూరి నాయ‌కా పాట‌ల‌కు డ్యాన్స్ చేసింది. ఇక నాగార్జున పాట‌ల విష‌యానికి వ‌స్తే...హలో బ్ర‌ద‌ర్ చిత్రంలోని క‌న్నెపెట్టరో...అఖిల్ చిత్రంలోని అక్కినేని అక్కినేని పాట‌ల‌కు డ్యాన్స్ చేసింది. వెంక‌టేష్ క్ష‌ణ క్ష‌ణం చిత్రంలోని చ‌లి చంపుతున్న‌.. పాట‌కు ల‌క్ష్మి చిత్రంలోని నేను పుట్టింది నీ కోస‌మే పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఈ పాట‌ల‌ను ఈ టాప్ స్టార్స్ చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ ల‌కు అంకితం ఇస్తున్న‌ట్టు స‌యేషా ప్ర‌క‌టించింది.
ఈ సంద‌ర్భంగా స‌యేషా స్పందిస్తూ.... నా జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని రోజు ఇది. చిరంజీవి సార్, బాల‌కృష్ణ సార్, నాగార్జున సార్, వెంక‌టేష్ సార్ మూవీస్ చూసి పెరిగాను. ఇంద్ర సినిమాలోని వీణ స్టెప్ ని చిరంజీవి గారు ఎదురుగా చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. సైమా ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభూతిని ఇచ్చింది. నా ప‌ర్ ఫార్మెన్స్ కి వ‌చ్చిన స్పంద‌న చూసి థ్రిల్ అయ్యాను. నాగార్జున సార్ తో క‌లిసి అఖిల్ సినిమాలో ఓ సాంగ్ లో క‌లిసి న‌టించాను. ఈరోజు నాగార్జున సార్ ఇక్క‌డ ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. ఇదే నా ఫ‌స్ట్ స్టేజ్ ప‌ర్ ఫార్మెన్స్. నేను ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌సు నుంచి లండ‌న్ లో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఒడిస్సి, క‌థ‌క్, బెల్లి డ్యాన్స్ & హిప్ హ‌ప్ కూడా నేర్చుకున్నాను.
స్టేజ్ ప‌ర్ ఫార్మెన్స్ పూర్త‌యిన త‌ర్వాత స్టేజ్ బ్యాక్ ఉన్నాను. ఆత‌ర్వాత నేను వ‌చ్చే స‌రికి చిరంజీవి గారు వెళ్ళిపోయారు. అయితే...నా డ్యాన్స్ ముఖ్యంగా వీణ స్టెప్ చిరంజీవి గార్ని ఎంత‌గానో ఆకట్టుకుంద‌ని సైమా టీమ్ చెప్ప‌డం నాకు చాలా సంతోషం క‌లిగించింది. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సుశాంత్, స‌మంత‌, అఖిల్ ...ఇలా అక్క‌డ ఉన్న తారలంద‌రూ నా పర్ ఫార్మెన్స్ ని మెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ అయితే..నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావ‌ని తెలియ‌దు. చాలా బాగా చేసావ్ అంటూ మెచ్చుకున్నారు. నాకు ఇన్ స్పిరేష‌న్ క‌లిగించిన వ్య‌క్తుల్లో అల్లు అర్జున్ ఒక‌రు. అల్లు అర్జున్ & రామ్ చ‌ర‌ణ్ ల‌తో డ్యాన్స్ చేయాల‌నేది నా డ్రీమ్. గ‌త ఎనిమిది నెల‌ల నుంచి తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే హిందీ సినిమా చేస్తుండ‌డంతో తెలుగు సినిమా చేయ‌లేదు. ఇప్పుడు హిందీ సినిమాని పూర్తి చేసాను. ఇక నుంచి వ‌రుస‌గా తెలుగు సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాను అని స‌యేషా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. మ‌రి..సైమా పుణ్య‌మా అని స‌యేషాకు అవ‌కాశాలు వ‌స్తాయ‌ని...టాలీవుడ్ లో స‌క్సెస్ అవ్వాల‌నే స‌యేషా డ్రీమ్ నెర‌వేరుతుంద‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.