close
Choose your channels

'లవ్ స్టొరీ' లొకేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్

Wednesday, February 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్"లవ్ స్టొరీ" లొకేషన్ లో యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగాయి. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి , నిర్మాత సునీల్ నారంగ్ లతో పాటు భరత్ నారంగ్,డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా తదితరులు దర్శకుడు శేఖర్ కమ్ముల కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ' లవ్ స్టొరీ' షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ల్లో ఉన్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కి విడుదల చేసిన 'లవ్ స్టొరీ' ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.శేఖర్ కమ్ముల , చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ క్రేజ్ కి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.