close
Choose your channels

మహేష్ బాటలోనే శర్వానంద్ కూడా

Thursday, September 21, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన ద్విభాషా చిత్రం స్పైడ‌ర్‌. స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందిన స్పైడ‌ర్ ఇటీవ‌లే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది. సింగిల్ క‌ట్ కూడా లేకుండా యు/ ఎ స‌ర్టిఫికేట్ పొందింది ఈ సినిమా. ద‌స‌రా కానుక‌గా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది స్పైడ‌ర్‌. ఇదే ద‌స‌రా సంద‌ర్భంలో మ‌రో సినిమా కూడా రానుంది. అదే మ‌హానుభావుడు.

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా కూడా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది. విశేష‌మేమిటంటే.. ఈ చిత్రం కూడా ఒక్క క‌ట్ కూడా లేకుండా యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. ఈ నెల 29న విడుద‌ల కానున్న మ‌హానుభావుడు చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత‌మందించారు. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.