close
Choose your channels

ఆలోచింపజేసేలా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ లుక్!

Monday, June 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆలోచింపజేసేలా శర్వానంద్ ఒకే ఒక జీవితం ఫస్ట్ లుక్!

శర్వానంద్ 30వ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే విడుదలయింది. డెబ్యూ దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ' ఒకే ఒక జీవితం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ సింపుల్ గా ఉంటూనే ఆలోచింపజేసే విధంగా ఉంది.

ఇదీ చదవండి: వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

శర్వానంద్ గిటార్ భుజాన వేసుకుని కనిపిస్తున్నాడు. అతడి ఎదురుగా వృత్తాకారంలో ఉన్న డిజైన్ సినిమా థీమ్ ని తెలియజేస్తోంది. ఓ వైపు పోస్ట్ ఆఫీస్, రైన్ బో, పచ్చదనం కనిపిస్తుంటే.. మరో వైపు సెల్ ఫోన్, విమానం, ఫ్యాక్టరీలు, కాలుష్యం కనిపిస్తున్నాయి.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో గ్లోబలైజేషన్ ప్రభావాన్ని చెప్పకనే చెప్పారు. ఈ చిత్రం ఫ్యామిలీ కథాంశంతో, సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు.

శర్వానంద్ కు జోడిగా యంగ్ బ్యూటీ రీతూ వర్మ నటిస్తోంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. అక్కినేని అమల ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.