close
Choose your channels

శతమానంభవతి ఆడియో&మూవీ రిలీజ్ డేట్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

Monday, October 31, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం శ‌త‌మానంభ‌వ‌తి. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడుత‌రాల విభిన్న క‌ధాంశంతో ఈ చిత్రం రూపొందుతుంది. రాజ‌మండ్రి సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.
బంధాలు అనుబంధాలు ప్రాధాన్య‌త‌ను తెలియ‌చెప్పే ఈ విభిన్న క‌థా చిత్రంలో ఇంద్ర‌జ‌, శివాజీరాజా, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ ఆడియో విష‌యానికి వ‌స్తే...డిసెంబ‌ర్ 18న గ్రాండ్ గా ఆడియో వేడుక‌ను నిర్వ‌హించేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. అయితే...శ‌త‌మానంభ‌వ‌తి సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంది అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల పై దిల్ రాజుని సంప్ర‌దిస్తే...ఎట్టి ప‌రిస్థితుల్లోను రిలీజ్ డేట్ మార‌దు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న శ‌త‌మానంభ‌వ‌తి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.