close
Choose your channels

ఈనెలాఖరుకి శర్వానంద్ - దిల్ రాజు ల శతమానంభవతి షూటింగ్ పూర్తి

Monday, November 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోదావరి జిల్లా అమలాపురంలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ ఈనెల‌ 18 కి పూర్త‌వుతుంది. ఈనెల‌ 28 కి పాటలతో సహా షూటింగ్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంటుంది.
శతమానంభవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. చిత్రం షూటింగ్ నెలాఖరుకి పూర్తవుతుంది. డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని, జనవరి లో సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : రాజు , శిరీష్, దర్శకత్వం : సతీష్ వేగేశ్న.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.