close
Choose your channels

మోనాల్ రెమ్యూనరేషన్‌పై షాకింగ్ న్యూస్..

Thursday, December 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్ గజ్జర్ రెమ్యునరేషన్ విషయంలో షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ మోనాల్ తీసుకుందని టాక్ నడుస్తోంది. ఐదంటే ఐదు తెలుగు సినిమాల్లో నటించి గాయబ్ అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత బిగ్‌బాస్ స్క్రీన్‌పై కనిపించి షాకిచ్చింది. ఈ సీజన్‌కి సంబంధించి అమ్మ రాజశేఖర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆయన మధ్యలోనే ఎలిమినేట్ అవడం.. మోనాల్ 14 వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగడంతో ఆమె రెమ్యునరేషన్‌ను ఎవరూ అందుకోలేకపోయారని టాక్.

అయితే మోనాల్ బిగ్‌బాస్ విన్నర్‌కి సమానమైన రెమ్యునరేషన్‌ను ఇప్పటికే పొందిందని టాక్ నడుస్తోంది. మోనాల్‌ 14 వారాలకు గాను.. 93 లక్షల రెమ్యునరేషన్‌ను పొందిందట. వినడానికే షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజమని తెలుస్తోంది. మోనాల్‌కు ఫైనల్‌కు వెళ్లాలన్న కల నేరవేరకపోయినా భారీ మొత్తంలో మోనాల్‌కు రెమ్యూనరేషన్ దక్కించుకుందనే టాక్ జోరుగా నడుస్తోంది. విన్నర్ కాకపోయినా మోనాల్‌కు విన్నర్‌కు సమానమైన రెమ్యూనరేషన్ దక్కిందింట.. అదే విన్నర్ అయితే మోనాల్ రెమ్యునరేషన్ దాదాపు కోటిన్నర వరకూ ముట్టేదని తెలుస్తోంది.

అయితే మోనాల్‌కు బిగ్‌బాస్ కారణంగా అయితే తనకు ఇప్పటి వరకూ రానంత నేమ్, ఫేమ్ వచ్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆ నేమ్, ఫేమ్ ఆమె కెరీర్ ముందుకు వెళ్లడానికి ఉపయోగపడతాయా? అంటే డౌటే. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరికీ కూడా తమ కెరీర్ పరంగా కలిసొచ్చిందైతే లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మళ్లీ సౌత్‌లో మంచి ఆఫర్ ఒకటి వచ్చిందని.. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని తెలిపింది. అయితే మోనాల్ బిగ్ బాస్ ఫేమ్‌తో టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.