close
Choose your channels

తమన్నాకు పాట పాడుతున్న శృతి...

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శృతిహాస‌న్ హీరోయినే కాదు, మంచి సింగర్‌ కూడా. వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమాల్లో పాట పాడుతుంటుంది. చాలా సినిమాల్లో పాట పాడింది. తాజాగా మ‌రో సినిమాలో త‌న గ‌ళాన్ని విపించ‌నుంది. విశాల్‌, త‌మ‌న్నా న‌టిస్తున్న `ఒక్క‌డొచ్చాడు` సినిమాలో ఈ పాట పాడుతుంద‌ని స‌మాచారం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాలో త‌మ‌న్నా సోలోసాంగ్‌ను శృతిహాస‌న్ పాడ‌నుండ‌టం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో పాట‌లు పాడిన శృతిహాస‌న్ హీరోయిన్ సాంగ్ పాడ‌టం ఇదే మొద‌టిసారి. భారీ బ‌డ్టెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జి.హ‌రి నిర్మిస్తున్నారు. సురాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.