close
Choose your channels

బాలీవుడ్ లోకి 'సింగం3'

Thursday, August 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో హిట్ సీక్వెల్ సింగం సిరీస్‌. ఇందులో మొద‌టి పార్ట్ సింగం అజ‌య్‌దేవ‌గ‌న్, రోహిత్ శెట్టి కాంబినేష‌న్‌లో బాలీవుడ్‌లో విడుద‌లై సూప‌ర్‌హిట్ అయ్యింది. సింగం 2 క‌థ‌ను మార్చి బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌న్ చేసిన సింగం2 చేశాడు. మ‌రి సింగం3 ద‌క్షిణాదిన విడుద‌లైంది.

అయితే ఈసారి బాలీవుడ్‌లో ఈ సిరీస్‌3లో అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించ‌డం లేద‌ట‌. డిఎస్‌పి న‌ర‌సింహం పాత్ర‌లో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నిడియోల్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాను ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ డైరెక్ట్ చేస్తాడ‌ట‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టైల్‌కు త‌గ్గ‌ట్లు క‌థ‌లో మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట‌. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తార‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.