close
Choose your channels

న్యూడ్ ఫొటో అడిగిన ఫ్యాన్‌.. షాకిచ్చిన శ్రీముఖి

Thursday, February 25, 2021 • తెలుగు Comments

న్యూడ్ ఫొటో అడిగిన ఫ్యాన్‌.. షాకిచ్చిన శ్రీముఖి

టాలీవుడ్‌లో స్టార్ యాంక‌ర్స్‌లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి బుల్లితెర‌పై బిజి బిజీగా ఉంటోంది. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ వెండితెర‌పై కూడా సంద‌డి చేయ‌డానికి రెడీ అంటోందీ అమ్మ‌డు. అంతే కాదండోయ్ .. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంది. రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌తో చాట్ చేసింది. ఆ స‌మ‌యంలో ఓ తుంట‌రి అభిమాని శ్రీముఖిని అడ‌గకూడ‌ని ప్ర‌శ్న అడిగాడు. అయితే శ్రీముఖి కూడా ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదండోయ్‌. వెంట‌నే.. స‌ద‌రు కొంటెబ్బాయి బుర్ర తిరిగే స‌మాధానం ఇచ్చింది మ‌రి. ఇంత‌కీ తుంట‌రి అభిమాని శ్రీముఖితో చాట్ చేసే స‌మయంలో న్యూడ్ ఫొటో ఉంటే షేర్ చేయ‌వా అని అడిగాడు. అందుకు బ‌దులుగా రామ్‌గోపాల్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన న‌గ్నం ఫొటోను షేర్ చేసింది శ్రీముఖి. ఏమాత్రం కోప్ప‌డ‌కుండా శ్రీముఖి ఇచ్చిన స్పాంటేనియ‌స్ రియాక్ష‌న్‌కు నెటిజ‌న్స్ ఫిదా అయ్యారు.

న్యూడ్ ఫొటో అడిగిన ఫ్యాన్‌.. షాకిచ్చిన శ్రీముఖి

బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొన‌డ‌మే కాదు.. ర‌న్న‌ర‌ప్‌గా నిలిచి త‌న క్రేజ్‌ను మ‌రింత పెంచుకుంది శ్రీముఖి. అలాగే, బుల్లితెర కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటు తీరిక లేకుండా మారింది. వీటితో పాటు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.లువీ పేరుతో ఓ బ్యూటీ ప్రొడ‌క్ట్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది శ్రీముఖి.

Get Breaking News Alerts From IndiaGlitz