close
Choose your channels

'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం' నిర్మాణ ప్రారంభోత్స‌వం

Thursday, October 12, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గోదా క్రియేషన్స్ పతాకంపై వానమామలై కృష్ణదేవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీకరం శుభకరం నారాయ‌ణీయం'. ప్రశాంత్ నిమ్మని, ఐంద్రిల్లా చక్రవర్తి జంటగా నటిస్తున్న నూతన చిత్రం గురువారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ సముద్రాల వేణుగోపాల చారి ఇవ్వగా, శ్రీమతి మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా...

దర్శక నిర్మాత కృష్ణ దేవ్ మాట్లాడుతూ "ఇటీవల కాలం లో యూత్ ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వంటి మంచి కార్యాలు మరచి పెడద్రోవ పడుతున్నారు. ఈ చెడు మార్గాన్ని తప్పించి మంచి మార్గంలో పయనించేలా చేయడమే ఈ చిత్ర ముఖ్యాంశం. నవంబర్ నెలాఖరు నుంచి మొదలు పెట్టి జనవరి నెలాఖరులోగా చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాం" అని తెలిపారు.

ముఖ్య అతిథి సముద్రాల వేణుగోపాల్ మాట్లాడుతూ "సంఘంలో పెరిగికోతున్న దూరాచారాల కు యూత్ దోహదపడుతోంది. ఈ ధోరణి మారాలనే భావనతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. ఇంత మంచి కాన్సెప్ట్ తో వస్తున్న దర్శక నిర్మాత కృష్ణ దేవ్ గారికి నా అభినందనలు తెలియ చేస్తున్నాను" అన్నారు.

హీరో ప్ర‌శాంత్ నిమ్మ‌ని మాట్లాడుతూ "మంచి సబ్జెక్ట్ తో ముందుకు వస్తున్నాం, స్కోప్ ఉన్న చిత్రంలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసినందుకు దర్శకునికి నా కృతజ్ఞతలు" అన్నారు.

హీరోయిన్ ఐంద్రిల్లా చక్రవర్తి మాట్లాడుతూ "సోషల్ అండ్ మైత్లాజికల్ స్టోరీ, మొదటి సినిమాలోనే ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది, నాకు సపోర్ట్ చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు" అని అన్నారు.

సంగీత దర్శకుడు తారక రామారావు మాట్లాడుతూ "భక్తి రక్తి కలసిన ఈ చిత్రంలో 7పాటలున్నాయి. సంగీతం బాగా కుదిరింది. జె యేసుదాస్, బాలు గారు కూడా ఈ చిత్రంలో పాడుతుండటం విశేషం" అని తెలిపారు.

లిరిక్ రైటర్స్ రాజు, మధు సాల, కెమెరామెన్ నాయుడు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.

ప్ర‌శాంత్ నిమ్మ‌ని, ఐంద్రిల్లా చ‌క్ర‌వ‌ర్తి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి కెమెరాః మల్లేష్ నాయుడు, మ్యూజిక్ః తార‌క రామారావు, సాహిత్యంః మ‌ధు ఫ‌లం, రాజు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః వాన‌మామ‌లై కృష్ణ‌దేవ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.