close
Choose your channels

ఓవర్ సీస్ లో శ్రీరస్తు - శుభమస్తు రీ రిలీజ్..!

Saturday, August 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఇప్ప‌టికీ స్ట‌డీ క‌లెక్ష‌న్స్ తో శిరీష్ కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచింది శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రానికి త‌మ‌న్ మ్యూజిక్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలిచింది.
ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని 32 ల‌క్ష‌లు మంది చూడ‌డం విశేషం. ఇదిలా ఉంటే...ఆగ‌ష్టు 4న పోటీ ఎక్కువ ఉండ‌డంతో ఈ మూవీకి కావ‌ల‌సిన‌న్ని థియేట‌ర్స్ ఓవ‌ర్ సీస్ లో దొర‌క‌లేదు.అయితే...సినిమా స‌క్సెస్ సాధించ‌డంతో రీ రిలీజ్ కి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. క్లాసిక్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఓవ‌ర్ సీస్ లో రీ రిలీజ్ రైట్స్ ద‌క్కించుకుంది. టిక్కెట్ ధ‌ర $ 8గా నిర్ణ‌యించారు. అంతే కాకుండా ఓవ‌ర్ సీస్ ఆడియోన్స్ కోసం నాలుగు హిలేరియ‌స్ సీన్స్ క‌ల‌ప‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.