close
Choose your channels

గణిత ఉపాధ్యాయుడి పాత్రలో స్టార్ హీరో..

Wednesday, June 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ఇప్పుడు ఓ విల‌క్ష‌ణ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఇంత‌కు ఆ పాత్ర ఏంట‌ని అనుకుంటున్నారా..లెక్క‌ల టీచ‌ర్ పాత్ర‌. బీహ‌ర్ రాష్ట్రంలోని పాట్నాలోని ఎంతో మంది ఐఐటీ విద్యార్థుల‌ను త‌యారు చేసిన ఆనంద్ కుమార్ పాత్ర‌ను హృతిక్ పోషించ‌నున్నాడు. వెనుక‌బ‌డిన, పేద విద్యార్థుల‌కు ఆనంద్ కుమార్ ఐఐటీలో శిక్ష‌ణ‌నిచ్చేవాడు.
అందు కోసం 30 సూత్రాల‌తో కూడిన ఓ ప్రోగ్రామ్‌ను కూడా ఆనంద్ కుమార్ త‌యారు చేశాడు. అమెరికాలో ప్ర‌ముఖ విశ్వ‌విద్యాలయం హార్వ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంతో పాటు ఎంఐటి కూడా ఆనంద్ కుమార్‌ను స్పెష‌ల్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. గ్లాడియేట‌ర్ ఫేమ్ ర‌స్సెల్ క్రో ఏ బ్యూటీఫుల్ మైండ్ అనే చిత్రంలో జాన్ నాష్ అనే గ‌ణిత మేధావి పాత్ర‌లో న‌టించ‌గా, స్లమ్ డాగ్ మిలియ‌నీర్ ఫేమ్ దేవ్ ప‌టేల్ ప్ర‌ముఖ గ‌ణిత మేధావి రామానుజ‌మ్ పాత్ర‌లో ద మేన్ హు న్యూ ఇన్‌ఫినిటి అనే చిత్రంలో న‌టించాడు. త‌ర్వాత హృతిక్ ఆనంద్ కుమార్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.